శాపముచే అహల్య
నల్లరాయి అయ్యెను
ప్రేమచే వియోగవేదన
చలువరాయి (Tajmahal) అయ్యెను
కన్నులు మేసిన అందాలను
హృదయము తేలిగ్గా నేమరువేస్తుంది
కన్నులు నిద్రమరిచి
గుండెకు అందిస్తుంటాయి
స్నానము చేసి
కురులు తుడుచుకుంటూ
వాన మబ్బోల్లో
హంసలే తలలు వాల్చాయి
జలపాతమా నా వలెనే
దినమంతా విలపిస్తావు
రాత్రంతా రాతిబండకు
నెత్తిని బాదుకొంటావు